Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

ఎఫెసీయులకు 6వ అధ్యాయము

1  పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. 
2-3. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, 2ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది. 
4  తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. 
5  దాసులారా, శుద్ధాంతఃకరణగలవారై భయముతోను వణుకుతోను క్రీస్తుకువలె, శరీరవిషయమై మీ యజమానులైనవారికి విధేయులైయుండుడి. 
6  మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి దేవుని చిత్తిమును మనఃపూర్వకముగా జరిగించుచు, 
7  మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువుకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి. 
8  దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏసత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు. 
9  యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై వారిని బెదరించుట మాని ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి. 
10  తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. 
11  మీరు అపవాదితంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి. 
12  ఏలయనగా మనము పోరాడునది శరీరులతోకాదు. ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. 
13  అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చుసర్వాంగ కవచమును ధరించుకొనుడి. 
14  ఏలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని 
15  పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. 
16  ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. 
17  మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరిచుంకొనుడి. 
18  ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతివిధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెళుకువగా ఉండుడి. 
19  మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ మొదలు పెట్టునప్పుడు 
20  దాని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుకై వాక్ఛక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును (పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెళకువగా ఉండుడి. ) 
21  మీరును నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియసహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియజేయును. 
22  మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతని మీయొద్దకు పంపితిని. 
23  తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసు క్రీస్తునుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక. 
24  మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువారికందరికిని కృప కలుగును గాక. 

      Download Audio File

No comments:

Post a Comment