Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

ఎఫెసీయులకు 5వ అధ్యాయము

1  కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. 
2  క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళవాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. 
3  మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. 
4  మరియు కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవచ్చును గాని, బూతులైనను, పోకిరిమాటలైనను, 2 సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు. 
5  వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. 
6-7. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి; ఇట్టి క్రియలవలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికివచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారైయండకుడి. 
8  మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. 
9  వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమనువాటిలో కనబడుచున్నది. 
10  గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలెనడుచుకొనుడి. 
11  నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి. 
12  ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది. 
13  సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా? 
14  అందుచేతను - నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తునీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 5
  15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియ్యక ఉపయోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 
17  ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. 
  18-19. మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు, 
20  మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, 
21  క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. 
22  స్త్రీలారా, ప్రభువునకువలె మీ స్వపురుషులకు లోబడియుండుడి. 
23  క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నుడు. 
24  సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతివిషయములోను తమ పురుషులకు లోబడవలెను. 
25-27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దాని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దాని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. 
 28-30. అటువలెనే పురుషులుకూడ తమ స్వశరీలములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడుగాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును, మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక ఆలాగే క్రీస్తును సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. 
31  ఈ హేతువుచేతను పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యతో హత్తుకొనును; వారిద్దరును ఒక్క శరీరమగుదురు. 1
32  ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను. 
33  మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను. 
       Download Audio File

No comments:

Post a Comment