1-3. కాబట్టి మీరు సమాధానమను బంధముచేత ఆత్మకలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధకలిగినవారై, ప్రేమతో ఒకని నొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువునుబట్టి ఖైదినైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
4 శరీరమొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణగలవారై యుండుటకు పిలువబడితిరి.
5 ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, బాప్తిస్మమొక్కటే,
6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించిఅందరిలో ఉన్నాడు.
7 అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరముయొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.
8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని (ప్రవక్త) చెప్పియున్నాడు. 2
9 ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకుదిగెననియు అర్థమిచ్చుచున్నది గదా.
10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైనవాడునై యున్నాడు.
11-12. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్యధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులగాను, కొందరిని ప్రవక్తలగాను, కొందరిని సువార్తికులగాను, కొందరిని కాపరులగాను ఉపదేశకులగాను నియమించెను.
13 మనమందరము విశ్వాసమిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురషత్వము కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
14 అందువలన మనమికమీదట పసిపిల్లలమైయుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగరగొట్టబడినవారమైనట్లుండక,
15 ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదుము.
16 ఆయన శిరస్సయియున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణముచొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన కలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.
17 కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
18 వారైతే అంధమైన మనస్సుగలవారై, తమ హృదయకాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలనలకలుగు జీవములోనుండి వేరు పరచబడినవారై, తమ మనస్సుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకొనుచున్నారు.
19 వారు సిగ్గులేని వారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుకొనిరి.
20-21. అయితే మీరు యేసునుగూర్చి విని ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైనయెడల మీరాలాగు క్రీస్తును (గూర్చి) నేరుచుకొన్నవారుకారు.
22 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమునువదులుకొని
23 మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,
24 నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమునుధరించుకొనవలెను.
25 మనము ఒకరికొకరము అవయవములమై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
26 కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించినపిమ్మట మీ కోపము నిలిచియుండకూడదు.
27-28. అపవాదికిచోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచి పెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.
29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాష యేదైనను మీ నోట రానియ్యకుడి.
30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.
31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32 ఒకనియెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
Download Audio File

No comments:
Post a Comment