1 ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తుయేసు యొక్క ఖైదినైన పౌలను నేను (ప్రార్థించుచున్నాను. )
2 మికొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటునుగూర్చి మీరు వినియున్నారు.
3 ఎట్లనగా (క్రీస్తు) మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.
4 మీరుదాని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన ప్రాజ్ఞతను గ్రహించుకొనగలరు.
5 ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడియున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు.
6 ఈ మర్మమేదనగా - అన్యజనులు సువార్తవలన, క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారనునదియే.
7 దేవుడు కార్యకారియగా తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరముచొప్పున నేను ఆ సువార్తకు
8-11. దేవుడు మన ప్రభువైన క్రీస్తుయేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కానిక్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటుఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు కృప అనుగ్రహించెను.
12 ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.
13 కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను; ఇవి మీకు మహిమకరములై యున్నవి.
14 ఈ హేతువుచేత పరలోకమునందును భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని
15-18. మీరు అంతరంగపురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మవలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకును,
19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమకలుగునుగాక. ఆమేన్.
Download Audio File

No comments:
Post a Comment